Oke Oka Jeevitham: శర్వానంద్ 'ఒకే ఒక జీవితం' టీజర్ విడుదల

Oke Oka Jeevitham teaser out now
  • శర్వా, రీతూ వర్మ జంటగా 'ఒకే ఒక జీవితం'
  • శ్రీ కార్తీక్ దర్శకత్వం
  • తమిళంలో 'కణం' పేరుతో విడుదల కానున్న చిత్రం
  • రెండు భాషల్లో టీజర్ విడుదల

శర్వానంద్, రీతూ వర్మ జంటగా శ్రీ కార్తీక్ దర్శకత్వంలో 'ఒకే ఒక జీవితం' సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇదే చిత్రం తమిళంలో 'కణం' పేరుతో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇవాళ తెలుగు, తమిళ భాషల్లో చిత్ర టీజర్ ను విడుదల చేశారు. టైమ్ మెషీన్ కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది.

'ఒకే ఒక జీవితం' చిత్రాన్ని డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్సార్ ప్రభు, ఎస్సార్ ప్రకాశ్ బాబు నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో నాజర్, అమల అక్కినేని కీలకపాత్రల్లో కనిపిస్తారు. వెన్నెల కిశోర్, ప్రియదర్శి, అలీ ఇతర పాత్రలు పోషించారు.

  • Loading...

More Telugu News