Dhulipala Narendra Kumar: జగన్ ఏపీకి ముఖ్యమంత్రా... గుజరాత్ కు ముఖ్యమంత్రా...?: టీడీపీ నేత ధూళిపాళ్ల

Dhulipalla fires on AP CM Jagan over Amul company
  • సీఎం జగన్ పై ధూళిపాళ్ల ధ్వజం
  • అమూల్ కంపెనీ కోసం ఆరాటపడుతున్నారని వ్యాఖ్యలు
  • గుజరాత్ సీఎం కూడా ఇంత తాపత్రయపడి ఉండరని విమర్శలు
  • పాడిరైతులను మోసం చేస్తున్నారంటూ ఆగ్రహం
టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఏపీ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. జగన్ ఏపీకి ముఖ్యమంత్రా లేక గుజరాత్ కు ముఖ్యమంత్రా? అంటూ నిలదీశారు. అమూల్ కంపెనీ కోసం గుజరాత్ సీఎం కూడా ఇంతగా తాపత్రయపడి ఉండరని నరేంద్ర వ్యాఖ్యానించారు. రూ.150 కోట్లు ఇస్తే ఒంగోలు డెయిరీ తెరుచుకుంటుందని, నష్టాల్లో ఉన్న డెయిరీలకు ప్రభుత్వం ఎందుకు సాయం చేయదని ప్రశ్నించారు.

మూతపడిన సహకార డెయిరీలు తెరుస్తామని సీఎం జగన్ మాటిచ్చారని, అబద్ధాలతో పాడి రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. సహకార డెయిరీలను నిర్వీర్యం చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశువుల బీమా, గోపాలమిత్ర పథకాలు ఏమయ్యాయి? అంటూ నిలదీశారు. రాష్ట్రంలో పశువుల దాణా నియంత్రణ చట్టం దారుణంగా ఉందని ధూళిపాళ్ల నరేంద్ర వ్యాఖ్యానించారు.
Dhulipala Narendra Kumar
CM Jagan
Amul
Dairy
Andhra Pradesh
Gujarath

More Telugu News