Sunrisers Hyderabad: డేవిడ్ వార్నర్ ను అభినందిస్తూ ట్వీట్ చేసిన సన్ రైజర్స్ ఫ్రాంచైజీ

Sunrisers Hyderabad congrats David Warne for Australia retaining Ashes
  • గత ఐపీఎల్ సీజన్ లో విఫలమైన వార్నర్
  • సన్ రైజర్స్ జట్టులో స్థానం కోల్పోయిన వైనం
  • తాజాగా యాషెస్ గెలిచిన ఆసీస్
  • కంగ్రాట్స్ డేవీ అంటూ సన్ రైజర్స్ ట్వీట్
ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ గత ఐపీఎల్ సీజన్ లో పేలవ ఆటతీరుకు తోడు నాయకత్వ వైఫల్యాలతో సన్ రైజర్స్ హైదరాబాద్  జట్టులో స్థానం కోల్పోవడం తెలిసిందే. టోర్నీ మధ్యలో అవమానకర పరిస్థితుల్లో వార్నర్ ను తప్పించారంటూ అప్పట్లో వ్యాఖ్యలు వినిపించాయి.

అయితే, ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్ పై మూడో టెస్టులో నెగ్గి యాషెస్ ను నిలబెట్టుకున్న నేపథ్యంలో సన్ రైజర్స్ యాజమాన్యం వార్నర్ ను ఉద్దేశించి ట్వీట్ చేయడం ఆశ్చర్యం కలిగించింది. 'యాషెస్ విజయం పట్ల శుభాభినందనలు డేవీ. చూస్తుంటే నువ్వు మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్టుంది. మ్యాచ్ అనంతరం పార్టీని బాగా ఎంజాయ్ చేస్తావనుకుంటున్నాం. అలాగే, ఐపీఎల్ తాజా వేలంలో మంచి ధర పలకాలని కోరుకుంటున్నాం' అంటూ సన్ రైజర్స్ యాజమాన్యం పేర్కొంది. అయితే ఈ ట్వీట్ పై వార్నర్ ఇంతవరకు స్పందించలేదు.
Sunrisers Hyderabad
David Warner
Ashes
Australia
Auction
IPL

More Telugu News