ఆ 11 రోజులూ వీఐపీ లేఖలతో రావద్దు.. భక్తులకు టీటీడీ సూచన
- నేరుగా వచ్చే వీఐపీలకే దర్శనం
- రోజుకు 45 వేల మంది దర్శనం చేసుకునే ఏర్పాట్లు
- కరోనా లక్షణాలు ఉంటే ఆగిపోవాలి
- టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి సూచన
వైకుంఠ ద్వార దర్శనానికి నిత్యం 45 వేల మంది భక్తులను అనుమతించే విధంగా ఏర్పాటు చేసినట్టు ధర్మారెడ్డి చెప్పారు. "వైకుంఠ ఏకాదశి రోజున తెల్లవారుజామున 2 గంటల నుంచి దర్శనాలు మొదలవుతాయి. శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు, వీఐపీలకు బ్రేక్ దర్శనం అనంతరం 9 గంటల నుంచి సర్వ దర్శనం ప్రారంభం అవుతుంది’’ అని ఆయన వివరించారు. భక్తులు ఎవరైనా కానీ కరోనా లక్షణాలు ఉంటే స్వామి దర్శనాన్ని వాయిదా వేసుకోవాలని సూచించారు.