student: హైదరాబాద్‌లో విషాదం.. నాలుగో అంత‌స్తు నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్యాయత్నం

student attempt suicide
  • రాజేంద్రనగర్ లోని కిస్మత్ పూర్ లో ఘ‌ట‌న‌
  • ఎంబీఏ చ‌దువుతోన్న ఉదయ్ కిరణ్ రెడ్డి
  • పరిస్థితి విషమంగా ఉంద‌న్న‌ వైద్యులు

హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లోని కిస్మమత్ పూర్ లో ఉదయ్ కిరణ్ రెడ్డి అనే ఎంబీయే విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ రోజు ఉద‌యం నాలుగో అంతస్తు నుంచి కిందికి దూకడంతో ఉదయ్ కిర‌ణ్‌కు తీవ్ర గాయాల‌య్యాయి. దీంతో ఆ యువకుడిని చికిత్స నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

ప్ర‌స్తుతం ఆ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. తీవ్ర ఒత్తిడి కార‌ణంగానే ఆ విద్యార్థి ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఉద‌య్ కిర‌ణ్ ఆత్మ‌హ‌త్యాయత్నానికి గ‌ల కార‌ణాల‌పై విచార‌ణ జ‌రుపుతున్నారు.

  • Loading...

More Telugu News