Jordan: జోర్డాన్ పార్లమెంటులో కొట్టుకున్న ఎంపీలు.. ఇదిగో వీడియో

  • సమాన హక్కుల రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఘర్షణ
  • పనికిమాలిన బిల్లు అంటూ ప్రతిపక్ష ఎంపీ కామెంట్
  • క్షమాపణకు పట్టుబట్టిన అధికార పక్ష నేతలు
Jordan Parliamentarians Fight In House During Debate

ప్రజల సమస్యలపై కొట్లాడాల్సిన ఎంపీలు.. చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. ఆ ఫైట్ కు పార్లమెంట్ సభాస్థలమే వేదికైంది. ఈ ఘటన జోర్డాన్ లో జరిగింది. సమాన హక్కులపై జోర్డాన్ ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా.. మంగళవారం ఓ ప్రతిపక్ష ఎంపీ దానిని పనికిమాలిన బిల్లు అంటూ వ్యాఖ్యానించారు.

ఆయన వ్యాఖ్యలపై అధికార పార్టీ ఎంపీల్లో ఆగ్రహం కట్టలు తెంచుకొంది. ప్రతిపక్ష ఎంపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దానికి ఆ ఎంపీ నిరాకరించడంతో రెండు పక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్తా పెద్ద దుమారంగా మారింది.

ఎంపీలు సీట్ల నుంచి లేచొచ్చి పరస్పరం దాడులు చేసుకున్నారు. చొక్కాలు పట్టుకుని ముష్టి ఘాతాలు కురిపించుకున్నారు. వారి కొట్లాటను అక్కడి మీడియా చానెళ్లు లైవ్ ప్రసారం చేశాయి. వారి ఘర్షణతో సభ వాయిదా పడింది. ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పార్లమెంట్ అధికారులు వెల్లడించారు. కాగా, దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

More Telugu News