Pavan kalyan: పవన్ గురించి నిధి అగర్వాల్ ది కూడా అదే మాట!

  • నిధి అగర్వాల్ చేతిలో 'వీరమల్లు'
  • 'ఫేవరేట్ హీరో పవన్' అంటున్న నిధి  
  • ఆయన టెర్రిఫిక్ పెర్ఫార్మర్
  • 'వన్ మేన్ ఆర్మీ' అంటూ ప్రశంస 
Hari Hara Veera Mallu movie update

పవన్ కల్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఆయన సినిమా విడుదలైతే థియేటర్ల దగ్గర జాతర వాతావరణమే కనిపిస్తుంది. ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది యంగ్ హీరోలు తాము ఆయన అభిమానులమని చెప్పుకుంటూ ఉంటారు. ఇక ఆయనతో కలిసి పనిచేసిన వాళ్లంతా ఆయన వ్యక్తిత్వం గురించి గొప్పగా చెబుతుంటారు.

పవన్ తో కలిసి పనిచేసిన ప్రతి కథానాయిక కూడా ఆయనలాంటి గొప్ప వ్యక్తిని చూడలేదనే చెబుతూ వచ్చారు. ఆయనతో కలిసి తొలి సినిమాగా 'హరిహర వీరమల్లు' చేస్తున్న నిధి అగర్వాల్ కూడా అదే మాట చెప్పింది. "నా ఫేవరేట్ హీరో పవన్ కల్యాణ్ .. ఆయన టెర్రిఫిక్ పెర్ఫార్మర్. ఆయన దేవుడి ఆశీస్సులతో కలిగిన వన్ మేన్ ఆర్మీ వంటివారు" అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.

తెలుగు తెరకి 'సవ్యసాచి' సినిమాతో పరిచయమైన నిధి అగర్వాల్, ఆ తరువాత 'మిస్టర్ మజ్ను' చేసింది. ఈ రెండు సినిమాలు అంతగా ఆడలేదు. ఆ తరువాత వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్'తో ఆమెకి హిట్ దక్కింది. ప్రస్తుతం ఆమె చేతిలో 'హీరో' .. 'హరిహర వీరమల్లు' సినిమాలు మాత్రమే ఉన్నాయి.

More Telugu News