UK: యూకేలో కరోనా విధ్వంసం.. ఒక్క రోజులో 1,29,471 కేసుల నమోదు

 UK Covid cases hit record high with 129471
  • బ్రిటన్‌లో జడలు విప్పుతున్న కరోనా
  • గత వారంతో పోలిస్తే ఏకంగా 42 శాతం పెరుగుదల
  • ‘రూల్ ఆఫ్ సిక్స్’ను తిరిగి తీసుకొచ్చే యోచన

బ్రిటన్‌లో కరోనా మళ్లీ జడలు విప్పుతోంది. నిన్న ఒక్క రోజులోనే అక్కడ రికార్డు స్థాయిలో ఏకంగా 1,29,471 కేసులు నమోదయ్యాయి. గతవారం అంటే డిసెంబరు 21న దేశంలో 90,625 కేసులు నమోదు కాగా, ఇప్పుడు ఏకంగా 42 శాతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తంగా గత వారం రోజుల వ్యవధిలో 8 లక్షల మందికిపైగా వైరస్ బారినపడ్డారని, అంతకుముందు వారంతో పోలిస్తే ఇది 30.3 శాతం అధికమని అధికారులు తెలిపారు.

కేసులు దారుణంగా పెరిగిపోతుండడంతో ‘రూల్ ఆఫ్ సిక్స్’ను తిరిగి తీసుకురావాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావిద్ మాత్రం కొత్త సంవత్సరానికి ముందు ప్రజలపై ఎలాంటి కొత్త ఆంక్షలు విధించబోమని చెప్పడం గమనార్హం. ప్రభుత్వ కరోనా వైరస్ డ్యాష్‌బోర్డు ప్రకారం.. డిసెంబరు 23 నాటికి పాజిటివ్ కేసుల వారం రోజుల రోలింగ్ రేటు ప్రతి లక్ష మందికి 1,145.4గా ఉంది.

  • Loading...

More Telugu News