Auto: ఇక ఆటో ఎక్కితే 5 శాతం జీఎస్టీ బాదుడు.. కొత్త ఏడాది నుంచి అమలు!

  • మరింత భారంగా ఆటో ప్రయాణం
  • ఈ కామర్స్ ద్వారా బుక్ చేసుకున్న ఆటోలకు మాత్రమే
  • ప్రయాణికులపై నిత్యం లక్షల రూపాయల భారం
should pay gst to auto ride from january

పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరల కారణంగా ఇబ్బంది పడుతున్న సామాన్య జనానికి ఇప్పుడు ఇంకో చేదువార్త. వచ్చే ఏడాది నుంచి ఆటో చార్జీలు మరింత పెరగబోతున్నాయి. ఇకపై ఆటో ప్రయాణానికి కూడా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

ఓలా, ఉబర్ వంటి రైడ్ షేరింగ్ యాప్‌లలో ఆటో బుక్ చేసుకుంటే కనుక ప్రభుత్వం 5 శాతం జీఎస్టీ వసూలు చేస్తుంది. ర్యాపిడో నుంచి బైక్ బుక్ చేసుకున్నా ఇదే వర్తిస్తుంది. బుక్ చేసుకునే సమయంలోనే జీఎస్టీ 5 శాతం కలిపేసి ధరను నిర్ణయిస్తారు. అయితే, ఆన్‌లైన్‌లో కాకుండా బయట ఆటోను బుక్ చేసుకుంటే మాత్రం ఈ జీఎస్టీ వర్తించదు. కాబట్టి ఇది కొంత ఊరటనిచ్చే విషయమే.

ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు 4 లక్షల మందిపై భారం పడనుంది. నగరంలో 38 వేల ఆటోలు ఓలా, ఉబర్ నుంచి బుకింగులు స్వీకరిస్తున్నాయి. అలాగే, ఒక్కో ఆటో రోజుకు 20 నుంచి 25 ట్రిప్పులు వేస్తుంటాయి. ఇవన్నీ కలుపుకుంటే రోజూ 8 లక్షలకు పైగా రైడ్లు అవుతున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే ప్రయాణికులపై నిత్యం లక్షల రూపాయల భారం పడుతుంది.

నిజానికి మధ్య తరగతి ప్రజలు కారు కంటే ఆటో ప్రయాణానికే ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. కారుతో పోలిస్తే ఆటో ధర తక్కువ కావడమే ఇందుకు కారణం. ఇప్పుడు ఆటో రైడ్‌పై జీఎస్టీ విధించడం వల్ల వీరందరిపైనా భారం పడనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కేంద్రం పునరాలోచించాలని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ కార్మికుల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ కోరారు.

  • Loading...

More Telugu News