దళిత, రైతు వ్యతిరేక బీజేపీని బొందపెట్టండి: కడియం శ్రీహరి
- యూపీ ఎన్నికల్లో బీజేపీ బొక్కబోర్లా పడుతుంది
- అఖిలేశ్ యాదవ్ దెబ్బకు మోదీ, షా మూతి పగలుతుంది
- కేసీఆర్ కూటమి కడతారన్న భయంతోనే ఇబ్బందులు
తెలంగాణ భవన్‌లో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ దేశవ్యాప్తంగా ఓ కూటమిని తయారుచేస్తారన్న భయంతోనే తెలంగాణ ప్రభుత్వాన్ని, రైతాంగాన్ని కేంద్రం ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. దళితులు, రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బీజేపీని బొందపెట్టాలని శ్రీహరి పిలుపునిచ్చారు.