Karnataka: పెళ్లికి నిరాకరించాడన్న కక్ష.. యువకుడి ఆటో, ఇంటిని తగలబెట్టించేసిన యువతి!

Young girl revange against boy friend for refused to marry her
  • పెళ్లి కోసం ఒత్తిడి చేస్తుండడంతో వేరే గ్రామానికి వెళ్లిపోయిన యువకుడు
  • పగ పెంచుకున్న యువతి
  • మనుషులను పంపి కక్ష తీర్చుకున్న యువతి
పెళ్లికి నిరాకరించిన యువకుడిపై పగబట్టిన ఓ యువతి అతడి జీవనాధారమైన ఆటోతోపాటు ఇంటిని కూడా తగలబెట్టించేసింది. కర్ణాటకలోని బీదర్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని బసవకల్యాణ తాలూకా హిప్పరగా గ్రామానికి చెందిన భీమరావు తల్లితో కలిసి సస్తాపూర్ గ్రామ సమీపంలో నివసించేవాడు.

ఈ క్రమంలో సుమ అనే యువతితో పరిచయమైంది. పరిచయం మరింత ముదరడంతో పెళ్లి చేసుకుందామని బలవంతం చేసింది. ఆమె ఒత్తిళ్లు రోజురోజుకు పెరిగిపోతుండడంతో తట్టుకోలేకపోయిన భీమరావు తల్లిని తీసుకుని బాగ్ హిప్పరగా గ్రామానికి వచ్చి స్థిరపడ్డాడు. మరోవైపు, తనను వివాహం చేసుకోకుంటే తాను చేబదులుగా ఇచ్చిన రూ. 4 లక్షలను తిరిగి ఇచ్చేయాలని సుమ డిమాండ్ చేసింది.

అయినప్పటికీ ఫలితం లేకపోవడం, తనను వివాహం చేసుకునేందుకు నిరాకరించడంతో పగ పెంచుకున్న సుమ ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. మనుషులను పంపి భీమరావు ఇంటిని, ఆటోను తగలబెట్టించింది. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Karnataka
Bidar
Basavakalyan
Marriage
Crime News

More Telugu News