Sudan: సూడాన్‌లో ఘోరం.. బంగారం గని కూలి 38 మంది మృతి

At least 38 people killed in Sudan Gold mine collapse
  • మరో 8 మందికి తీవ్ర గాయాలు
  • కొనసాగుతున్న సహాయక చర్యలు
  • మూసివేసిన గనిలోకి వెళ్లి బంగారం కోసం వెతుకులాట
సూడాన్‌లో ఘోరం జరిగింది. ఓ బంగారం గని కూలిన ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు సూడాన్ ప్రభుత్వ మినరల్ రిసోర్సెస్ కంపెనీ తెలిపింది. పశ్చిమ కోర్డోఫాన్ ప్రావిన్స్‌లోని అల్-నుహుద్‌లో జరిగిందీ ఘటన. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారని, వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు పేర్కొంది.

సమాచారం అందుకున్న వెంటనే గని వద్దకు చేరుకున్న అత్యవసర సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. గని కూలిన సమయంలో లోపల ఎంతమంది ఉన్నారన్న కచ్చితమైన సమాచారం లేదని అధికారులు తెలిపారు.

ఈ గని ఇటీవల కూడా ఓసారి కూలిపోవడంతో మూసివేశారు. స్థానికులు, చిన్నారులు లోపలికి వెళ్లి ప్రమాదకర పరిస్థితుల్లో బంగారం కోసం గాలిస్తుంటారని అధికారులు తెలిపారు. గని కూలకుండా ప్రభుత్వం ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆఫ్రికాలో అత్యధికంగా బంగారాన్ని ఉత్పత్తి చేసేది సూడానే. గతేడాది ఇక్కడ ఏకంగా 36.6 టన్నుల బంగారాన్ని వెలికి తీశారు.
Sudan
African Country
Gold Mine
Collapse

More Telugu News