Sajjala Ramakrishna Reddy: బీజేపీలో ఉన్న టీడీపీ ఏజెంట్లే ప్రజాగ్రహ సభ ఏర్పాటు చేశారు: సజ్జల

Sajjala satires on BJP Praja Agraha Sabha
  • విజయవాడలో ఏపీ బీజేపీ ప్రజాగ్రహ సభ
  • ఎద్దేవా చేసిన సజ్జల
  • సభ వెనుక చంద్రబాబు ఉన్నారని ఆరోపణ
  • ఏపీలో రామరాజ్యం నడుస్తోందని వెల్లడి
విజయవాడలో ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజాగ్రహ సభపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. బీజేపీలో ఉన్న టీడీపీ ఏజెంట్లే ప్రజాగ్రహ సభ ఏర్పాటుకు కారకులని ఆరోపించారు. అసలు, దీని వెనుక ఉన్నది చంద్రబాబేనని అన్నారు.

మామూలుగానే బీజేపీ పెద్దగా కనిపించదని, టీడీపీ కారణంగానే ఆ పార్టీ ఉనికిలో ఉందని వ్యాఖ్యానించారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఒకరో, ఇద్దరో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. వాళ్ల వల్లే బీజేపీ ఏపీలో మనుగడ సాగిస్తోందని అన్నారు.

బీజేపీలోనే కాదు, అటు జనసేన పార్టీలోనూ టీడీపీ వాళ్లే చక్రం తిప్పుతున్నారని వెల్లడించారు. ఒక పార్టీ పల్లవి అందుకుంటే ఇంకో పార్టీ రాగం అందుకుంటుందని, రాజకీయంగా టీడీపీ ఏ పాట పాడితే బీజేపీ, జనసేన అదే పాట పాడుతుంటాయని ఎద్దేవా చేశారు. అంతే తప్ప విపక్షాలకు సొంత ఆలోచన లేదని విమర్శించారు. రామరాజ్యం కావాలంటే వైసీపీని అనుసరించాలని సజ్జల హితవు పలికారు. సీఎం జగన్ ఆధ్వర్యంలో ఏపీలో రామరాజ్యం నడుస్తోందని అన్నారు.
Sajjala Ramakrishna Reddy
Praja Agraha Sabha
BJP
Vijayawada
YSRCP
CM Jagan
Andhra Pradesh

More Telugu News