Vangaveeti Ranga: నాకు గన్ మన్లు వద్దు... ప్రజలతోనే ఉంటా: వంగవీటి రాధా

Vangaveeti Ranga rejects security
  • తన హత్యకు రెక్కీ జరిగిందన్న రాధా
  • సీఎం జగన్ కు తెలిపిన మంత్రి కొడాలి నాని
  • 2 ప్లస్ 2 భద్రత కల్పించాలన్న సీఎం 
  • అభిమానులు, అనుచరులే తనకు రక్షణ అన్న రాధా

తన హత్యకు రెక్కీ జరిగిందంటూ టీడీపీ నేత వంగవీటి రాధా ఇటీవల చేసిన వ్యాఖ్యలతో ఏపీ ప్రభుత్వం గన్ మన్లను ఇచ్చేందుకు ఆదేశించడం తెలిసిందే. దీనిపై వంగవీటి రాధా స్పందించారు. తాను నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తినని, ప్రభుత్వ గన్ మన్లు వద్దని చెప్పానని వెల్లడించారు. తనకు గన్ మన్లు వద్దని, ప్రజలతోనే ఉంటానని ఉద్ఘాటించారు. అభిమానులు, అనుచరులే తనకు రక్షణ అని స్పష్టం చేశారు.

హత్యకు రెక్కీ చేశారని తాను వ్యాఖ్యలు చేసిన అనంతరం అన్ని పార్టీల నేతలు ఫోన్ లో పరామర్శించారని రాధా వెల్లడించారు. ఇప్పటివరకు పోలీసు ఉన్నతాధికారులు ఎవరూ తనతో మాట్లాడలేదని అన్నారు. తనను సంప్రదిస్తే రెక్కీకి సంబంధించిన సమాచారం అందిస్తానని, పోలీసు అధికారులకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. రెక్కీ గురించి తన వద్ద కంటే పోలీసుల వద్దే పూర్తి సమాచారం ఉందని రాధా వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News