Sunny: హీరో నానిని కలిసిన బిగ్ బాస్-5 విజేత సన్నీ... ఫొటోలు ఇవిగో!

Bigg Boss winner Sunny met hero Nani in Hyderabad
  • బిగ్ బాస్-5లో విజేతగా సన్నీ
  • నాని ఆఫీసుకు విచ్చేసిన వైనం
  • శ్యామ్ సింగరాయ్ విజయం పట్ల అభినందనలు
  • బిగ్ బాస్ విన్నర్ అయ్యావంటూ సన్నీని అభినందించిన నాని
ఇటీవలే ముగిసిన బిగ్ బాస్-5 తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను విశేషంగా అలరించింది. బిగ్ బాస్ లో ఈసారి టీవీ నటుడు, వీజే సన్నీ విజేతగా నిలిచాడు.

కాగా, సన్నీ నేడు తన అభిమాన హీరో నానిని కలిశాడు. నాని ఆఫీసుకు విచ్చేసిన సన్నీ... నానికి పుష్పగుచ్ఛం అందించి శ్యామ్ సింగరాయ్ విజయం సాధించినందుకు అభినందనలు తెలిపాడు. ఈ సందర్భంగా నాని కూడా బిగ్ బాస్ లో విన్నర్ గా నిలిచినందుకు సన్నీని మనస్ఫూర్తిగా అభినందించాడు. ఈ క్రమంలో ఇరువురు కాసేపు ముచ్చటించుకున్నారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

శ్యామ్ సింగరాయ్ ప్రమోషన్ కోసం నాని అండ్ టీమ్ ఇటీవల బిగ్ బాస్ ఇంటికి రాగా, నాని తనకు స్ఫూర్తిదాయకం అని సన్నీ ఇటీవలే బిగ్ బాస్ ఇంట్లో చెప్పడం తెలిసిందే.
Sunny
Bigg Boss-5
Winner
Nani
Tollywood

More Telugu News