Team India: సెంచురియన్ టెస్టు: తొలి ఇన్నింగ్స్ లో భారత్ 327 ఆలౌట్

  • మూడో రోజు ఆట ప్రారంభం
  • రాహుల్ 123 అవుట్
  • 6 వికెట్లు తీసిన ఎంగిడి
  • తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా
Team India concludes first innings in Centurion test

సెంచురియన్ టెస్టులో రెండో రోజు ఆట వర్షం కారణంగా రద్దు కాగా, నేడు మూడో రోజు ఆట ఎలాంటి ఆటంకాలు లేకుండా షురూ అయింది. ఓవర్ నైట్ స్కోరు 272-3 తో ఆట కొనసాగించిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 327 పరుగులకు ఆలౌట్ అయింది.

కేఎల్ రాహుల్ 123 పరుగులు చేయగా, అజింక్యా రహానే 48 పరుగులకు అవుటయ్యాడు. టీమిండియా లోయర్ ఆర్డర్ ఏమంత ప్రభావం చూపలేకపోయింది. సఫారీ పేసర్ లుంగీ ఎంగిడి 6 వికెట్లు పడగొట్టగా, రబాడా 3 వికెట్లు తీశాడు. మార్కో జాన్సెన్ కు ఒక వికెట్ దక్కింది.

ఇక తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టును బుమ్రా, షమీ దెబ్బతీశారు. కెప్టెన్ డీన్ ఎల్గార్ (1)ను బుమ్రా అవుట్ చేయగా, కీగాన్ పీటర్సన్ (15)ను షమీ బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోరు 8 ఓవర్లలో 2 వికెట్లకు 30 పరుగులు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 297 పరుగులు వెనుకబడి ఉంది.

More Telugu News