Andhra Pradesh: హిందూపురంలో బాలకృష్ణ ఇంటి ముందు ఉద్రిక్తత.. నినాదాలతో హోరెత్తించిన టీడీపీ, వైసీపీ శ్రేణులు

Tension Atmosphere At Balakrishna Home In Hindupur
  • డంపింగ్ యార్డ్ గొడవపై సవాళ్లు
  • బహిరంగ చర్చకు వచ్చిన టీడీపీ కార్యకర్తలు
  • ఇంటికి సమీపంలోనే వైసీపీ శ్రేణుల అడ్డగింత
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఇంటి వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీ కార్యకర్తలు కొందరు హిందూపురంలోని బాలకృష్ణ ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని మధ్యలోనే నిలువరించారు. పట్టణ శివార్లలో ఉన్న చెత్త డంపింగ్ యార్డును తరలించే విషయంపై కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది.

ఈ క్రమంలోనే బహిరంగ చర్చకు వైసీపీ నేతలు సవాల్ విసిరారు. దానికి టీడీపీ నేతలూ సై అన్నారు. దీంతో టీడీపీ శ్రేణులు ఇవాళ బాలకృష్ణ ఇంటికి చేరుకున్నారు. ఇటు వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడికి వచ్చారు. అయితే, ఇంటికి సమీపంలోనే వారిని పోలీసులు ఆపేశారు. ఇటు 'జై బాలయ్య' అంటూ టీడీపీ కార్యకర్తలు, అటు 'జై జగన్' అంటూ వైసీపీ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
Andhra Pradesh
Balakrishna
Hindupur
Telugudesam
YSRCP

More Telugu News