New Delhi: ఢిల్లీలో ‘ఎల్లో అలర్ట్’.. అమల్లోకి మరిన్ని ఆంక్షలు: సీఎం అరవింద్ కేజ్రీవాల్

  • ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష
  • 0.5 శాతం దాటిన పాజిటివ్ రేటు
  • తీవ్రత తక్కువే ఉందని ప్రకటన
More Curbs In Delhi Yellow Alert

కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో ఢిల్లీ సర్కారు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో ఆదేశాలు జారీచేస్తామని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఎన్నడూ లేని విధంగా సోమవారం ఒక్కరోజే ఢిల్లీలో 331 కేసులు వెలుగు చూశాయి. దీంతో ఉన్నతాధికారులతో కార్యాచరణపై సీఎం సమీక్ష నిర్వహించారు.

‘‘రెండు రోజులకు పైగా కరోనా పరీక్షల్లో పాజిటివ్ రేటు 0.5 శాతానికి పైనే ఉంటోంది. కనుక లెవల్-1 (ఎల్లో అలర్ట్) క్రమానుగత ప్రతిస్పందన కార్యాచరణ ప్రణాళికను అమల్లోకి తీసుకొస్తున్నాం. అమలు చేసే ఆంక్షల వివరాలతో ఆదేశాలు త్వరలోనే విడుదల చేస్తాం’’అని అధికారులతో సమీక్ష అనంతరం సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు.

‘‘ఢిల్లీలో కరోనా కేసులు పెరిగితే ఎదుర్కొనేందుకు గతంతో పోలిస్తే మేము 10 రెట్లు ఎక్కువగా సన్నద్ధతతో ఉన్నాం’’అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. కరోనా కేసుల తీవ్రత తక్కువగా ఉందన్నారు. కేసులు పెరుగుతున్నప్పటికీ ఆక్సిజన్ లేదా వెంటిలేటర్ల వినియోగం పెరగలేదని చెప్పారు.

More Telugu News