corona: కరోనాను కోలుకోనీయని దేశాలు.. అతి తక్కువ కేసులు ఈ దేశాల్లోనే..!

  • అన్నీ చిన్న దేశాలే
  • జనాభా కూడా చాలా తక్కువ
  • మొదటి నుంచే రక్షణాత్మక చర్యలు
Places Without Reported COVID19 Cases

కరోనాతో ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఆర్థికంగా, వైద్యపరంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాయి. కరోనాను కట్టడి చేయడం చాలా దేశాలకు శక్తికి మించిన పనే అయింది. ప్రపంచవ్యాప్తంగా 27 కోట్లకు పైగా ప్రజానీకం ఈ వైరస్ బారిన పడగా.. వారిలో 54 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ, కొన్ని దేశాలు 2020 ఆరంభం నుంచి కరోనాను కట్టడి చేయగా, కొన్ని దేశాలు నామమాత్రంగానే కేసుల సంఖ్యను ప్రకటించాయి.

తువాలు
హవాయి, ఆస్ట్రేలియా మధ్యలో ఉంది. జనాభా 10,000. తన సరిహద్దులను పూర్తిగా మూసేసి కేసులు రాకుండా చూసుకుంది.

తుర్కుమెనిస్థాన్
ఈ ఆసియా దేశం కూడా ఇప్పటి వరకు ఒక్క కేసును ప్రకటించలేదు. కానీ, ప్రయాణాలు, జనం ఎక్కువగా పోగయ్యే వేడుకలపై నిషేధం విధించింది. భౌతిక దూరం, మాస్క్ నిబంధనలను అమలు చేసింది.

టోంగా
170 దీవుల సమూహం ఈ దేశం. ఫిజికి పక్కనే ఉంటుంది. కరోనా మొదట్లోనే ఓడరేవులు, విమానాశ్రయాలను మూసేసుకుని రక్షణ కల్పించుకుంది. ఈ దేశంలోనూ ఒక్క కేసే నమోదైంది. జనాభా లక్ష మందికిపైనే.

టొకేలా
న్యూజిలాండ్ పై ఆధారపడిన దేశం ఇది. జనాభా 1,500. స్వీయ ఆంక్షలు అమలు చేసుకుని రక్షణ కల్పించుకుంది.

సెయింట్ హెలెనా
ప్రపంచంలో అత్యంత మారుమూల దేశం ఇది. ఆఫ్రికాకు 1,200 మైళ్ల దూరంలో, రియో డీజనీరోకు 2,500 మైళ్ల దూరంలో ఉంది. జనాభా సుమారు 6,000. రెండు కేసులే ఇక్కడ నమోదయ్యాయి.

ఉత్తరకొరియా
ఈ దేశం ప్రపంచానికి దూరంగా ఆంక్షల చట్రంలో నడుస్తుంటుందన్న సంగతి తెలిసిందే. నియంత కిమ్ పాలనలో ఉన్న ఈ దేశం కూడా ఒక్క కేసు ఉన్నట్టు ప్రకటించలేదు. కానీ, కరోనాకు ఆది అయిన చైనాకు పక్కనే ఉంది. చైనాతో సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి.

నౌరు
ప్రపంచంలో మూడో అతి చిన్న దేశమైన నౌరు 8 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. జనాభా 10,925 మంది. కేసులేవీ లేవు.

కిరిబటి
హవాయికి 2,000 మైళ్ల దూరంలో ఉంది. 1.21 లక్షల జనాభా ఉన్నా, ఒక్క కేసు నమోదు కాలేదు.

మైక్రోనేషియా
పసిఫిక్ మహాసముద్రంలో 600 ద్వీపాలతో ఉంటుంది. జనాభా లక్షకు పైనే ఉంది. ఒక ఒక్క కేసు నమోదైనట్లు చెబుతారు.

మార్షల్ ఐలాండ్స్
ఇది కూడా ద్వీప సముదాయ దేశమే. 60వేల వరకు జనాభా ఉన్న ఈ దేశంలో నమోదైన కేసులు 4. పసిఫిక్ ఐలాండ్ దేశాలన్నింటిలోనూ కరోనా కేసుల్లేవు. చాలా తక్కువ కేసులకు పరిమితమైన దేశాలు ఇంకా చాలానే ఉన్నాయి.

More Telugu News