Surya: సూర్య మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్!

  • సూర్య హీరోగా రూపొందిన 'ఈటి'
  • ఆయన జోడీగా ప్రియాంక మోహన్
  • దర్శకుడిగా పాండిరాజ్
  • ఫిబ్రవరి 4వ తేదీన విడుదల
Surya ET movie lyrical song released

సూర్య కథానాయకుడిగా పాండిరాజ్ దర్శకత్వంలో 'ఈటి' సినిమా రూపొందింది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించారు. సూర్య సరసన నాయికగా ప్రియాంక మోహన్ అలరించనుంది. తన కెరియర్లో ఇంతవరకూ ఆమె చేసిన పెద్ద సినిమా ఇదే. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

ఇమాన్ స్వరపరిచిన బీట్ వినసొంపుగా ఉంది. యుగభారతి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను ప్రదీప్ కుమార్ .. వందన శ్రీనివాసన్ ... బృంద ఆలపించారు. ఈ పాటలో సూర్య డిఫరెంట్ లుక్స్ ఆకట్టుకున్నాయి. అలాగే కాస్ట్యూమ్స్ పరంగా కూడా మంచి మార్కులు దక్కించుకుంటోంది. ఈ పాటకి జానీ మాస్టర్ కొరియోగ్రఫీని అందించాడు.

విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమాలో సత్యరాజ్ .. శరణ్య .. దేవదర్శిని .. సూరి ముఖ్యమైన పాత్రలను పోషించారు. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను ఫిబ్రవరి 4వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో చేరినట్టేననే నమ్మకంతో సూర్య ఉన్నాడు. అలాగే ఈ సినిమా హిట్ అయితే ప్రియాంక మోహన్ కెరియర్ పుంజుకోవడం ఖాయమనే చెప్పాలి. 

More Telugu News