Sourav Ganguly: బీసీసీఐ అధ్యక్షుడు సౌర‌వ్ గంగూలీకి కరోనా నిర్ధార‌ణ‌

  • కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స
  • స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు మాత్ర‌మే ఉన్నాయ‌న్న‌ వైద్యులు
  • ఈ ఏడాది జనవరిలో గంగూలీకి గుండెపోటు
ganguly tests positive for corona

బీసీసీఐ అధ్యక్షుడు సౌర‌వ్ గంగూలీకి కరోనా సోకింది. ఇటీవ‌ల ఆయ‌న అనారోగ్యానికి గురి కావ‌డంతో క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. దీంతో ఆయ‌న ప్రస్తుతం కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నట్లు బీసీసీఐ వ‌ర్గాలు మీడియాకు తెలిపాయి. ఆయ‌న‌కు స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు మాత్ర‌మే ఉన్నాయ‌ని వైద్యులు తెలిపారు.

గ‌తంలో గంగూలీ కుటుంబ స‌భ్యులు కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. కాగా, ఈ ఏడాది జనవరిలో గంగూలీ గుండెపోటుతో ఆసుప‌త్రిలో చేరిన విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లో ఆయ‌న‌కు వైద్యులు యాంజియోప్లాస్టీ చేసి అనంత‌రం డిశ్చార్జ్ చేశారు.

  • Loading...

More Telugu News