హైదరాబాద్ జూలో సింహాన్ని దత్తత తీసుకున్న పీజేఆర్ కుమార్తెలు

28-12-2021 Tue 09:34
  • జూపార్క్‌లోని ఆసియా సింహాన్ని దత్తత తీసుకున్న పీజేఆర్ కుమార్తెలు
  • డిసెంబరు 21 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు దత్తత
  • లక్ష రూపాయల చెక్కు అందించిన వైనం
PJR Daughters adopt Asiatic Lion in Hyderabad zoo
దివంగత కాంగ్రెస్ నేత పి.జనార్దనరెడ్డి కుమార్తెలు విజయారెడ్డి, పావనీరెడ్డి హైదరాబాద్ జూపార్క్‌లోని ఆసియా సింహాన్ని దత్తత తీసుకున్నారు. పీజేఆర్ ఫౌండేషన్ ఆధ్వరంలో కార్పొరేటర్ విజయారెడ్డి, సోదరి పావనీరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. నిన్న నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యురేటర్ రాజశేఖర్‌ను కలిసిన వీరిద్దరూ సింహం దత్తత, పోషణ, ఆహారం కోసం లక్ష రూపాయల చెక్కు అందించారు.

ఈ డిసెంబరు 21 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు ఈ సింహాన్ని దత్తత తీసుకున్నట్టు ఈ సందర్భంగా విజయారెడ్డి తెలిపారు. తండ్రి పీజేఆర్ వర్ధంతి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వారు తెలిపారు.