Leopard: ఊళ్లోకి వచ్చిన చిరుతను చూసి అరిచిన శునకం.. గేటు దూకి లోపలికొచ్చి దానిని పట్టుకెళ్లిన చిరుత.. వీడియో వైరల్

leopard jumps gate and attack on dog
  • వీడియోను షేర్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి
  • కొండ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు మామూలేనన్న పర్వీన్ కాశ్వాన్
  • క్రూర మృగాల బారినపడకుండా మెడకు ఇనుప కాలర్ చుట్టాలని సూచన
రాత్రివేళ ఓ గ్రామంలోకి చొరబడిన చిరుత వీధుల్లోంచి నడుచుకుంటూ వెళ్తోంది. ఓ ఇంటి గేటు లోపల ఉన్న శునకం ఆ చిరుతను చూసి అరిచి జనాన్ని అప్రమత్తం చేసే ప్రయత్నం చేసింది. ఆదమరిచి నిద్రపోతున్న జనాల సంగతేమో కానీ, చిరుత మాత్రం అప్రమత్తమైంది. వెంటనే గేటు దూకి లోపలికి వచ్చి అరుస్తున్న శునకాన్ని నోట కరుచుకుని మళ్లీ అమాంతం గేటు దూకి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కాశ్వాన్ ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న వివరాలను ఆయన వెల్లడించలేదు. కొండ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయని ఆయన పేర్కొన్నారు. వీటిని నివారించాలంటే పెంపుడు జంతువుల మెడకు ఇనుప కాలర్ చుట్టాలని, ఇవి క్రూరమృగాల నుంచి వాటిని రక్షిస్తాయని అన్నారు. అలాంటి ఫొటోను కూడా ఆయన ట్విట్టర్‌లో పంచుకున్నారు.
Leopard
Dog
Parveen Kaswan
IFS

More Telugu News