Bandla Ganesh: చెల్లని చెక్కు కేసులో ఒంగోలు కోర్టుకు హాజరైన నిర్మాత బండ్ల గణేశ్

Bandla Ganesh attends to Ongole court
  • గతంలో ఓ వ్యక్తికి చెక్కు ఇచ్చిన బండ్ల గణేశ్
  • చెక్కు బౌన్స్ కావడంతో కోర్టును ఆశ్రయించిన వ్యక్తి
  • విచారణకు హాజరుకాని బండ్ల గణేశ్
  • అరెస్ట్ వారెంట్ జారీ చేసిన కోర్టు
చెక్ బౌన్స్ కేసులో టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్ నేడు ఒంగోలు కోర్టుకు హాజరయ్యారు. చెల్లని చెక్కు కేసులో అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో బండ్ల గణేశ్ ఒంగోలు వచ్చారు. గతంలో ప్రకాశం జిల్లా ముప్పాళ్లకు చెందిన జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి నిర్మాత బండ్ల గణేశ్ రూ.1.25 కోట్లకు చెక్ ఇచ్చారు. ఆ చెక్కు బౌన్స్ కావడంతో జెట్టి వెంకటేశ్వర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

విచారణకు రావాలంటూ పలుమార్లు బండ్ల గణేశ్ కు సమన్లు వచ్చినప్పటికీ ఆయన వెళ్లలేదు. దాంతో అతడిపై వారెంట్ జారీ అయింది. ఈ నేపథ్యంలో బండ్ల గణేశ్ తాజా విచారణకు హాజరయ్యారు. వాదనలు విన్న అనంతరం కోర్టు తదుపరి విచారణను ఈ 2022 మార్చి 9కి వాయిదా వేసింది. 
Bandla Ganesh
Court
Cheque Bounce
Ongole
Tollywood

More Telugu News