Rajinikanth: రజనీకాంత్ సేవలకు మరింత విస్తృతి.. ఫౌండేషన్ పేరిట ప్రత్యేక వెబ్ సైట్

Rajinikanth Foundation website launched
  • సేవలు ఏవైనా ముందుగా తమిళనాడు నుంచే
  • టీఎన్ పీఎస్సీ పరీక్షలపై ఉచిత శిక్షణ
  • ‘సూపర్ 100 బ్యాచ్’ కోసం విద్యార్థులు పేర్లను నమోదు చేసుకోవచ్చు 

సూపర్ స్టార్, పద్మవిభూషణ్ రజనీకాంత్ తన సేవలను మరింత మందికి చేరువ చేసేందుకు వీలుగా ‘రజనీకాంత్ ఫౌండేషన్’ వెబ్ సైట్ ను ప్రారంభించారు. ఫౌండేషన్ ద్వారా పేదల విద్య, సానుభూతితో కూడిన పాలన, అత్యుత్తమ నాయకత్వం కోసం కృషి చేయనున్నట్టు రజనీకాంత్ చెప్పిన వ్యాఖ్యలతో ఒక ప్రకటనను ఫౌండేషన్ విడుదల చేసింది.  

ఫౌండేషన్ సేవలు తొలుత తమిళనాడుకే పరిమితమని ప్రకటించింది. తమిళ ప్రజల దీవెనలే తాను ఈ స్థాయికి రావడానికి కారణమన్న రజనీకాంత్ వ్యాఖ్యలను గుర్తు చేసింది. కనుక ఫౌండేషన్ సేవలు ఏవైనా కానీ ముందుగా తమిళనాడు నుంచే ఉంటాయని పేర్కొంది. టీఎన్ పీఎస్సీ గ్రూపు పరీక్షలపై శిక్షణ కార్యక్రమం ‘సూపర్ 100 బ్యాచ్’ కోసం విద్యార్థులు ఉచితంగా తమ పేర్లను వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

  • Loading...

More Telugu News