యంగ్ స్టార్ హీరోతో అనిల్ రావిపూడి?

27-12-2021 Mon 12:13
  • గోపీచంద్ మలినేనితో బాలయ్య
  • త్వరలో షూటింగ్ మొదలు
  • దసరాకి విడుదల చేసే ఛాన్స్  
  • ముగింపు దశలో అనిల్ రావిపూడి 'ఎఫ్ 3'
Balakrishna in Anil Ravipudi movie
మొదటి నుంచి కూడా అనిల్ రావిపూడి తన సినిమాల్లో కామెడీకి ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. 'నా అభిమాన దర్శకుడు జంధ్యాల గారు .. నాకు స్ఫూర్తి ఈవీవీగారు' అంటూ చెప్పే అనిల్ రావిపూడి ఆ ట్రాక్ తప్పకుండా ప్రేక్షకులను నాన్ స్టాప్ గా నవ్విస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'ఎఫ్ 3' సినిమా రూపొందుతోంది.

ఆ తరువాత సినిమాను ఆయన బాలకృష్ణతో చేయనున్నాడు. కథ ఆల్రెడీ ఓకే అయిపోయింది. గోపీచంద్ మలినేని సినిమా తరువాత తాను అనిల్ రావిపూడి సినిమా చేయనున్నట్టు బాలకృష్ణ కూడా ధ్రువీకరించారు. అయితే గోపీచంద్ మలినేనితో చేయనున్న మాస్ యాక్షన్ సినిమా దసరాకి ప్రేక్షకుల ముందుకు రానుంది.

వచ్చే నెలలో 'ఎఫ్ 3' షూటింగు పూర్తవుతుంది. ఏప్రిల్ 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అందువలన 6 నెలలకి పైగా అనిల్ రావిపూడి ఖాళీగా ఉండవలసి వస్తుంది. అందువలన ఆయన ఈ లోగా ఒక యంగ్ స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు. మరి ఆ హీరో నితిన్ అవుతాడా? రామ్ అవుతాడా? చూడాలి.