neem seeds: తరిగిపోతున్న వేప సంపద.. ఎకరాకు 20 చెట్లున్నా.. రూ.15 వేల ఆదాయం

demand increased for neem seeds
  • సేంద్రియ రసాయనాల్లో వేపనూనె వినియోగం
  • పెరిగిపోయిన డిమాండ్
  • వేప మొక్కలు నాటించాలంటూ రాష్ట్రాలకు కేంద్రం సూచన
వేప చెట్టు ఔషధ నిలయం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ, వేప చెట్లను అడ్డంగా ఉన్నాయని కొట్టేస్తూ రావడంతో ఇప్పుడు ఆ వృక్ష సంపద తరిగిపోతోంది. మరోవైపు వేప గింజలకు డిమాండ్ పెరిగింది. సేంద్రీయ సాగులో వేపను ఎక్కువగా వినియోగిస్తుండడం డిమాండ్ ను పెంచుతోంది. ఫలితంగా విదేశాల నుంచి వేప గింజలను దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే, 30 దేశాల్లోనే వేప చెట్లు ఉండడంతో దిగుమతి అవకాశాలు అంతంత మాత్రమే. దీంతో దేశీయంగానే వేపచెట్ల సాగును ప్రోత్సహించాలని కేంద్ర సర్కారు అన్ని రాష్ట్రాలను కోరింది.

వేప గింజల్లోని అజాడిరచ్ట అనే కెమికల్ పంట తెగుళ్లను అరికట్టడంలో మంచి ఫలితాలను ఇస్తోంది. దీంతో యూరియాతో పాటు వేపనూనెను కూడా విక్రయించడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీని ఫలితంగా 22వేల టన్నుల వేపనూనె అవసరమని అంచనా.

దేశవ్యాప్తంగా 3.5 కోట్ల వేప మొక్కలను నాటించాలన్న లక్ష్యాన్ని సర్కారు విధించుకుంది. ఒక ఎకరంలో 20 చెట్ల వరకు వేసుకోవచ్చు. వీటి మధ్యలో ఇతర పంటలను యథావిధిగా సాగు చేసుకోవచ్చు. దీంతో రెండు రకాల ఆదాయ వనరు ఏర్పడుతుంది. ఒక్కో వేప చెట్టు 50 కిలోల వరకు గింజలను ఒక ఏడాదిలో ఇస్తుంది. కిలో గింజలను రూ.15 చొప్పున ఇఫ్కో కొనుగోలు చేస్తుంది. దీంతో రూ.15 వేల వరకు అదనపు ఆదాయాన్ని రైతు సమకూర్చుకోవచ్చు.
neem seeds
neem farming

More Telugu News