Naveen Polishetty: హీరోగా బిజీ అవుతున్న నవీన్ పోలిశెట్టి!

Naveen Polishetti upcoming movies
  • 'జాతిరత్నాలు'తో భారీ హిట్
  • త్రివిక్రమ్ నిర్మాణంలో ఒక సినిమా
  • యూవీ బ్యానర్లో మరో సినిమా
  • కీలకమైన పాత్రలో అనుష్క

టాలీవుడ్ లో ఇప్పుడు అల్లరి నరేశ్ తరువాత కామెడీని నాన్ స్టాప్ గా నడిపించగల కథానాయకుడిగా నవీన్ పోలిశెట్టి పేరు వినిపిస్తోంది. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' టైటిల్ తో మంచి హిట్ అందుకున్న నవీన్, ఈ మధ్య వచ్చిన 'జాతిరత్నాలు'తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఆయనతో సినిమాలు చేయడానికి పెద్ద పెద్ద బ్యానర్లు ముందుకు వస్తుండటం విశేషం. సితార బ్యానర్ తో కలిసి నవీన్ తో ఒక సినిమాను నిర్మించడానికి త్రివిక్రమ్ సిద్ధమవుతున్నారు. ఈ సినిమాతో ఒక కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు. ఇక యూవీ క్రియేషన్స్ వారు కూడా నవీన్ తో ఒక సినిమాను చేస్తున్నారు. నిన్న నవీన్ బర్త్ డే సందర్భంగా సదరు నిర్మాతలు ఒక పోస్టర్ ను కూడా వదిలారు.

ఈ సినిమాలో అనుష్క ఒక కీలకమైన పాత్రను పోషించనున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకుముందు ఈ బ్యానర్లో అనుష్క 'మిర్చి' .. ' భాగమతి' సినిమాలు చేసింది. ఇప్పుడు ఈ సినిమాలోను ఆమె కనిపించనుందని అంటున్నారు. ఈ సినిమాకి మహేశ్ పి. దర్శకత్వం వహించనున్నాడు. త్వరలోనే ఈ సినిమాకి టైటిల్ ను ఖరారు చేసి, మిగతా విషయాలను వెల్లడించనున్నారు.

  • Loading...

More Telugu News