నా కిడ్నీ అమ్ముకోవాల్సివచ్చింది: మంచు లక్ష్మి
- ఆకలి వేయకపోయినా ఎయిర్ పోర్ట్ లాంజ్ లో తింటూనే ఉన్నా
- ఫ్లైట్ టికెట్ కొనేందుకు కిడ్నీ అమ్ముకోవాల్సి వచ్చింది
- టికెట్ డబ్బులకు న్యాయం చేసేందుకు తింటూనే ఉన్నా
'ఆకలి వేయకపోయినా ఎయిర్ పోర్ట్ లాంజ్ లో తింటూనే ఉన్నా. ఫ్లైట్ టికెట్ కొనేందుకు నేను కిడ్నీ అమ్ముకోవాల్సి వచ్చింది. అందుకే ఆ టికెట్ డబ్బులకు న్యాయం చేసేందుకు ఆకలి కాకపోయినా తింటూనే ఉన్నా' అంటూ ట్వీట్ ద్వారా చమత్కరించారు.
మంచు లక్ష్మి చేసిన ట్వీట్ కు నెటిజెన్లు భారీగా స్పందించారు. మీరు రిచ్ కదా అక్కా... మీరు కూడా ఇలా చేస్తారా? అని ఒక నెటిజెన్ ప్రశ్నించారు. దీనికి సమాధానంగా.. 'మా నాన్న రిచ్ తమ్ముడూ... నేను కాదు' అని ఆమె సమాధానమిచ్చారు.