RRR: 'ఆర్ఆర్ఆర్'తో బాలీవుడ్ కు ప్రమాదం: తరణ్ ఆదర్శ్ హెచ్చరిక

  • బాలీవుడ్ మెట్రో సెంట్రిక్ సినిమాలతో బిజీగా ఉంది
  • టైర్-2, టైర్-3 నగరాలను కోల్పోతున్నాం
  • మెట్రో, నాన్ మెట్రోలను దక్షిణాది సినిమాలు టార్గెట్ చేస్తున్నాయి
RRR will effect Bollywood says Taran Adarsh

'బాహుబలి'తో బాలీవుడ్ లో దక్షిణాది సినిమాల హవా ప్రారంభమైంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'బాహుబలి' బాలీవుడ్ రికార్డులను బద్దలు చేసింది. ఆ తర్వాత కన్నడ సినిమా 'కేజీఎఫ్' కూడా సూపర్ హిట్ అయింది. తాజాగా విడుదలైన అల్లు అర్జున్ 'పుష్ప' హిందీ వర్షన్ బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ పై 'ఆర్ఆర్ఆర్' ఎఫెక్ట్ భారీగా ఉండబోతోందని అన్నారు.

'బాలీవుడ్ పూర్తిగా మెట్రో సెంట్రిక్ సినిమాలను చేయడంలో బిజీగా ఉంది. చాలా కాలం క్రితమే మనం గ్రామీణ ప్రాంతాలను వదిలేశాం. ఇప్పుడు క్రమంగా టైర్-2, టైర్-3 నగరాలు, పట్టణాలను కూడా కోల్పోతున్నాం. ఇదే సమయంలో హిందీలోకి డబ్ అవుతున్న దక్షిణాది చిత్రాలు మెట్రోలు, నాన్ మెట్రోలను కూడా టార్గెట్ చేస్తున్నాయి.

'బాహుబలి', 'కేజీఎఫ్', 'పుష్ప' హిందీ చిత్రాలు ఇప్పటికే ఈ ప్రాంతాల్లో విజయవంతమయ్యాయి. ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' వస్తోంది. ఈ సినిమా ఎఫెక్ట్ బాలీవుడ్ పై భారీగా ఉంటుంది. వెయిట్ చేయండి' అని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ను తుపానుగా మార్చబోతోందని జోస్యం చెప్పారు.

మరోవైపు ఇటీవల ముంబైలో జరిగిన 'ఆర్ఆర్ఆర్' ప్రీరిలీజ్ ఈవెంట్లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఆర్ఆర్ఆర్' విడుదలైన నాలుగు నెలల వరకు ఏ సినిమాను విడుదల చేసే సాహసం చేయవద్దని ఆయన హెచ్చరించారు.

More Telugu News