Manikka Vinayagam: ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’ సింగర్ మాణిక్య వినాయగం కన్నుమూత

Tamil playback singer Manikka Vinayagam passes away at 73
  • పట్టుపట్టు చెయ్యే పట్టు.. పాటతో తెలుగు ప్రేక్షకులను ఊపేసిన వినాయగం
  • పలు భాషల్లో 800కుపైగా పాటలు
  • గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గాయకుడు
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సినిమాలో ‘పట్టుపట్టు చెయ్యే పట్టు’ పాటతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న తమిళ నేపథ్య గాయకుడు, నటుడు మాణిక్య వినాయగం కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న తుదిశ్వాస విడిచారు.

2001లో ‘దిల్’ అనే తమిళ సినిమాతో గాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అన్ని భాషల్లోనూ కలిపి ఇప్పటి వరకు 800కుపైగా పాటలు పాడారు. అలాగే, వేల సంఖ్యలో ఆధ్యాత్మిక, జానపద పాటలు పాడారు. గాయకుడిగానే కాక నటుడిగానూ ఆకట్టుకున్నారు. తమిళంలో పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆయన మృతితో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. వినాయగం మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
Manikka Vinayagam
Kollywood
Playback Singer
Passed Away

More Telugu News