Madhuban: సన్నీ లియోన్ పాటపై మంత్రి వార్నింగ్ తో దిగొచ్చిన మ్యూజిక్ కంపెనీ

Saregama says lyrics and name Madhuban song will change
  • 'మధుబన్' అనే గీతాన్ని విడుదల చేసిన సారేగమా
  • పాట అభ్యంతరకరంగా ఉందన్న మధ్యప్రదేశ్ హోంమంత్రి
  • హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని వెల్లడి
  • లిరిక్స్, పాట పేరు మార్చేస్తామన్న 'సారేగమా'
బాలీవుడ్ నటి సన్నీ లియోన్ తాజాగా నటించిన 'మధుబన్' అనే పాట వివాదాస్పదం కావడం తెలిసిందే. ఈ పాటతో హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని, పాటను తొలగించాలంటూ మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మంత్రి హెచ్చరికల నేపథ్యంలో ఆ పాటను రూపొందించిన మ్యూజిక్ కంపెనీ 'సారేగమా' దిగొచ్చింది. పాట లిరిక్స్ ను, పాట పేరును మార్చేస్తున్నామని నేడు ఓ ప్రకటనలో వెల్లడించింది. అంతేకాదు, పాత పాటను తొలగించి, మరో మూడు రోజుల్లో కొత్త పాటను తీసుకువస్తామని వివరణ ఇచ్చింది.

కాగా, మంత్రి నరోత్తమ్ మిశ్రా... నటి సన్నీ లియోన్ కు, గాయకులు షారిబ్, తోషీలకు కూడా గట్టి వార్నింగ్ ఇచ్చారు. మూడు రోజుల్లో పాటను తొలగించి, క్షమాపణలు చెప్పాలని అల్టిమేటం ఇచ్చారు. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Madhuban
Sunny Leone
Narottam Mishra
Saregama

More Telugu News