KL Rahul: ఓపెనర్ కేఎల్ రాహుల్ సెంచరీ... భారీ స్కోరు దిశగా టీమిండియా

KL Rahul completes ton against South Africa in Centurion
  • సెంచురియన్ లో టీమిండియా, దక్షిణాఫ్రికా తొలి టెస్టు
  • 218 బంతుల్లో సెంచరీ సాధించిన రాహుల్
  • టీమిండియా స్కోరు 3 వికెట్లకు 240 రన్స్
సెంచురియన్ లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుత శతకం నమోదు చేశాడు. మయాంక్ అగర్వాల్ (60)తో కలిసి జట్టుకు శుభారంభం అందించిన కేఎల్ రాహుల్ ఆపై 218 బంతుల్లో సెంచరీ సాధించాడు. రాహుల్ స్కోరులో 14 ఫోర్లు, 1 సిక్సు ఉన్నాయి.

ప్రస్తుతం టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు 79 ఓవర్లలో 3 వికెట్లకు 240 పరుగులు. కేఎల్ రాహుల్ 106, అజింక్యా రహానే 25 పరుగులతో క్రీజులో ఉన్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 35 పరుగులు చేసి లుంగీ ఎంగిడి బౌలింగ్ లో అవుటయ్యాడు. టీమిండియా కోల్పోయిన మూడు వికెట్లు ఎంగిడీ ఖాతాలో చేరాయి. పుజారా డకౌట్ అయ్యాడు.
KL Rahul
Century
First Test
Team India
South Africa

More Telugu News