సీజేఐ ఎన్వీ రమణకు గవర్నర్ తేనీటి విందు... హాజరైన ఏపీ సీఎం జగన్

CM Jagan attends Governor Tea Party for CJI NV Ramana at Raj Bhavan
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పర్యటన కొనసాగుతోంది. ఆయన ఈ సాయంత్రం విజయవాడలో రాజ్ భవన్ కు విచ్చేశారు. సీజేఐ ఎన్వీ రమణకు రాజ్ భవన్ వర్గాలు సాదర స్వాగతం పలికాయి. భారత చీఫ్ జస్టిస్ కు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు.

కాగా, జస్టిస్ ఎన్వీ రమణకు విజయవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన సత్కారం జరిగింది. గుంటుపల్లిలో జరిగిన ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, జస్టిస్ వినీత్ శరణ్, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ లావు నాగేశ్వరరావు మాట్లాడుతూ, కోకా సుబ్బారావు తర్వాత 60 ఏళ్లకు ఓ తెలుగువాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యాడని జస్టిస్ ఎన్వీ రమణను కొనియాడారు.
Go Back to Shorts
CM Jagan
Tea Party
CJI NV Ramana
Governor
Biswabhusan Harichandan
Andhra Pradesh

More Telugu News