NTR: మా కుటుంబాల మధ్య పోరు నడుస్తున్నా మేమిద్దరం మంచి స్నేహితులం: ఎన్టీఆర్

NTR interesting comments on friendship with Ram Charan
  • జనవరి 7న 'ఆర్ఆర్ఆర్' విడుదల
  • ప్రమోషన్ ఈవెంట్లలో పాల్గొంటున్న జూనియర్ ఎన్టీఆర్
  • చరణ్ తో తన పోరు ఆరోగ్యకరమైనదని వెల్లడి
  • ఆర్ఆర్ఆర్ తర్వాత మరిన్ని మల్టీ స్టారర్ చిత్రాలు వస్తాయని ధీమా

'ఆర్ఆర్ఆర్' విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రమోషన్ ఈవెంట్లతో బిజీ అయ్యాడు. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రామ్ చరణ్ తో సాన్నిహిత్యంపై స్పందిస్తూ.... చెప్పొచ్చో లేదో కానీ తమ రెండు కుటుంబాల మధ్య గత 35 ఏళ్లుగా పోరు నడుస్తోందని అన్నాడు. అయితే తాను, రామ్ చరణ్ మంచి స్నేహితులమని పేర్కొన్నాడు. తమ మధ్య పోరు ఎప్పుడూ సానుకూల ధోరణిలోనే ఉంటుందని ఎన్టీఆర్ స్పష్టం చేశాడు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత దేశంలోని అగ్ర హీరోలందరూ భారీ మల్టీ స్టారర్ చిత్రాల్లో నటిస్తారని భావిస్తున్నట్టు తెలిపాడు.

  • Loading...

More Telugu News