మొత్తానికి కేంద్రం నా సలహాను పాటించింది: బూస్టర్ డోసులపై రాహుల్ గాంధీ
- సరైన నిర్ణయం తీసుకుందన్న కాంగ్రెస్ నేత
- టీకాలు, బూస్టర్లు ప్రతి ఒక్కరికీ అందాలని కామెంట్
- జనవరి 10 నుంచి వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి, ఫ్రంట్ లైన్ వారియర్లకు బూస్టర్ డోసులు
కాగా, జనవరి 3 నుంచి 15 నుంచి 18 ఏళ్ల వారికీ వ్యాక్సిన్లు వేయడంతో పాటు అదే నెల 10 నుంచి ఫ్రంట్ లైన్ వారియర్లు, వృద్ధులకు బూస్టర్ డోసులు (ప్రికాషనరీ డోసు) వేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో పాటు పిల్లలకు వేసే కరోనా టీకా కొవాగ్జిన్ కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి కూడా వచ్చింది.