Crime News: రాజకీయాలు ఆషామాషీ వ్యవహారం కాదు: రాజకీయ రంగ ప్రవేశం వార్తలపై హర్భజన్

Harbhajan Singh Clarifies about joining in Politics
  • సుదీర్ఘ కెరియర్‌కు శుక్రవారం ముగింపు పలికిన భజ్జీ
  • రాజకీయ పార్టీల నుంచి ఆహ్వానాలు అందాయని వెల్లడి
  • భవిష్యత్ ప్రణాళికలు ఇంకా రూపొందించుకోలేదన్న వెటరన్
తాను రాజకీయాల్లో చేరబోతున్నట్టు వస్తున్న వార్తలపై టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. క్రికెట్‌లో సుదీర్ఘకాలం కొనసాగిన భజ్జీ.. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుంచి తప్పుకుంటున్నట్టు శుక్రవారం ప్రకటించాడు. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసిన హర్భజన్ రాజకీయాల్లో చేరబోతున్నాడంటూ ఆ వెంటనే వార్తలు ఊపందుకున్నాయి. ఈ వార్తలపై స్పందించిన భజ్జీ.. రాజకీయాల్లో చేరే విషయమై తాను ఇప్పటి వరకు ఎలాంటి ఆలోచన చేయలేదన్నాడు. అయితే, కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం తనను ఆహ్వానించిన విషయం నిజమేనని పేర్కొన్నాడు.

రాజకీయాలు అనుకున్నంత తేలిక కాదని పేర్కొన్నాడు. భవిష్యత్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రణాళికలు వేసుకోలేదన్నాడు. క్రికెట్ వల్లే తానెవరన్న విషయం ఈ ప్రపంచానికి తెలిసింది కాబట్టి దానితో ముడిపడిన వ్యవహారాల్లోనే కొనసాగుతానని స్పష్టం చేశాడు. రాజకీయాలంటే ఆషామాషీ వ్యవహారం కాదని, ఈ విషయంలో తెలివిగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నాడు. ఒకవేళ రాజకీయాల్లో చేరేందుకు ప్రణాళిక వేసుకుంటే కనుక ఆ విషయాన్ని స్వయంగా వెల్లడిస్తానని హర్భజన్ తెలిపాడు.
Crime News
Team India
Politics
Harbhajan Singh

More Telugu News