Errabelli: ఎర్రబెల్లి దయాకర్ కు కరోనా పాజిటివ్

TS minister Errabelli tests Corona positive
  • ఢిల్లీ నుంచి నిన్న సాయంత్రం తిరిగొచ్చిన ఎర్రబెల్లి
  • ఈ ఉదయం కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు
  • ప్రస్తుతం హోం ఐసొలేషన్ లో ఉన్న మంత్రి
తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కరోనా బారిన పడ్డారు. రాష్ట్ర సమస్యలకు సంబంధించి తెలంగాణ మంత్రులు ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఢిల్లీ పర్యటనను ముగించుకుని నిన్న రాత్రి ఆయన హైదరాబాదుకు చేరుకున్నారు.

ఈ రోజు ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన వైద్యులను సంప్రదించారు. ఆయనకు డాక్టర్లు వైద్య పరీక్షలను నిర్వహించగా కరోనా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. గత మూడు, నాలుగు రోజులుగా తనను కలిసిన వారు కరోనా పరీక్షలను చేయించుకోవాలని కోరారు. తాను ఐసొలేషన్ లో ఉన్నన్ని రోజులు తనను కలిసేందుకు ఎవరూ రావద్దని చెప్పారు. నియోజకవర్గ ప్రజలకు తన పీఏలు, అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు.
Errabelli
TRS
Corona Virus
Positive

More Telugu News