Vishal: 'సామాన్యుడు' నుంచి ఇంట్రెస్టింగ్ టీజర్!

  • విశాల్ హీరోగా 'సామాన్యుడు'
  • కథానాయికగా డింపుల్ హయతి 
  • యాక్షన్ ప్రధానంగా సాగే కథ 
  • వచ్చేనెల 26వ తేదీన విడుదల
Saamanyudu Teaser Released

విశాల్ కథానాయకుడిగా 'సామాన్యుడు' సినిమాను శరవణన్ రూపొందించాడు. విశాల్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ  సినిమాలో ఆయన సరసన నాయికగా డింపుల్ హయతి అలరించనుంది. ఒక సామాన్యుడు కొంతమంది అవినీతి పరులకు వ్యతిరేకంగా ఎదురువెళ్లడమే ఈ కథ. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు.

"ఇక్కడ రెండు రకాల మనుషులే ఉన్నారు. ఒకరు జీవితాన్ని అది నడిపించే దారిలో నడవాలనుకునే సామాన్యుడు. ఇంకొకరు ఆ సామాన్యుడిని డబ్బు .. పేరు .. అధికారం కోసం అంతం చేయాలనుకునే రాక్షసులు. ఆ రాక్షసుల తలరాతను మార్చి రాయవలసిన పరిస్థితి ఒక రోజున ఒక సామాన్యుడికి వస్తుంది" అనే విశాల్ వాయిస్ తో ఈ టీజర్ మొదలైంది.

లవ్ .. మాస్ యాక్షన్ తో కూడిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. జనవరి 26వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విశాల్ నుంచి వచ్చిన 'ఎనిమి' సినిమాకి తెలుగులో మంచి మార్కులుపడ్డాయి. ఇక ఈ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

  • Loading...

More Telugu News