Anandaiah: ఒమిక్రాన్ కు ఆనందయ్య మందు పంపిణీ

  • కరోనా సోకకుండా బూస్టర్ మాదిరి వేసుకోవచ్చన్న ఆనందయ్య
  • మందును ఒకే రోజు రెండు పూటలా వేసుకుంటే సరిపోతుందని వివరణ
  • 15 రోజుల పాటు మాంసం, మద్యం తీసుకోకూడదని సూచన
Anandaiah medicine ready for Omicron

కరోనాకు మందు తయారు చేసి దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య ఇప్పుడు ఒమిక్రాన్ కు కూడా మందును తయారు చేశారు. ఈ మందు పంపిణీని కూడా ప్రారంభించారు.

ఒమిక్రాన్ సోకకుండా ముందు జాగ్రత్తగా బూస్టర్ డోస్ మాదిరి ఈ మందును వేసుకోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. సుమారు 22 రకాల దినుసులతో ఐదు రకాల మందులు తయారు చేసినట్టు చెప్పారు. ఈ మందును ఒకే రోజు రెండు పూటలా తీసుకుంటే సరిపోతుందని తెలిపారు. తన మందుల తయారీకి కోర్టుల అనుమతి కూడా ఉందని చెప్పారు.

ఒమిక్రాన్ సోకిన వారు మందు కోసం తనను సంప్రదించవచ్చని ఆనందయ్య తెలిపారు. ప్రస్తుతం ఈ మందును బంధువులు, మిత్రుల ద్వారా ఒమిక్రాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న యూకే, యూఎస్ఏ తదితర దేశాలకు ఎక్కువగా పంపిస్తున్నామని చెప్పారు. ఈ మందును ఏడాది పాటు నిల్వ ఉంచుకోవచ్చని తెలిపారు. మందు తీసుకునే వారు 15 రోజుల పాటు మాంసాహారం, మద్యం తీసుకోకూడదని చెప్పారు.

More Telugu News