cristmas: తెలుగు రాష్ట్రాల్లో ఘ‌నంగా క్రిస్మస్ వేడుక‌లు.. కుటుంబ స‌భ్యుల‌తో కలిసి చ‌ర్చిలో ఏపీ సీఎం జ‌గ‌న్ ప్రార్థ‌న‌లు

  • క్రైస్త‌వుల‌తో నిండిపోతోన్న చ‌ర్చిలు
  • ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటోన్న ప్ర‌జ‌లు
  • పులివెందుల‌లోని సీఎస్ఐ చ‌ర్చికి జ‌గ‌న్ కుటుంబం
  • విద్యుత్ కాంతులీనుతోన్న మెద‌క్ చ‌ర్చి
cristmas celebrations in ap ts

తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జ‌రుగుతున్నాయి. చర్చిల్లో ఉద‌యం నుంచే ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభ‌మ‌య్యాయి. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రజలకు ఏపీ సీఎం జ‌గ‌న్ శుభాకాంక్షలు తెలిపారు. క‌డ‌ప జిల్లా పులివెందుల‌లో సీఎస్ఐ చ‌ర్చికి ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి వెళ్లి క్రిస్మ‌స్ వేడుక‌ల్లో పాల్గొన్నారు. ఈ ప్రార్థ‌న‌ల్లో జ‌గ‌న్‌తో పాటు ఆయ‌న త‌ల్లి విజ‌య‌మ్మ‌, భార్య భారతి కూడా పాల్గొన్నారు. ప్ర‌జ‌లంద‌రికీ మంచి జ‌ర‌గాల‌ని దేవుడిని కోరుకున్న‌ట్లు జ‌గ‌న్ ఈ సందర్భంగా చెప్పారు.

కాగా, తెలంగాణ‌లోనూ క్రిస్మ‌స్ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. మానవత్వాన్ని చాటే ఏసుక్రీస్తు బోధనలను గుర్తు చేసుకుంటూ ప్ర‌జ‌లు ఈ వేడుక‌ల్లో పాల్గొంటున్నారు. క్రిస్మస్ సందర్భంగా తెలంగాణ‌లోని మూడు లక్షల మందికి ప్రభుత్వం కానుకలు అందించినట్లు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.

క్రైస్త‌వులు క‌రోనా నిబంధనలు పాటిస్తూ ఈ పండుగ‌ను జ‌రుపుకోవాల‌ని ఆయ‌న సూచించారు. కాగా, ప్రపంచ ప్రసిద్ధ మెదక్ చర్చిలో క్రిస్మ‌స్ వేడుక‌లు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. గ‌త రాత్రి నుంచే విద్యుత్ కాంతులీనుతూ ఆ చ‌ర్చి మెరిసిపోయింది. హైద‌రాబాద్‌, సికింద్రాబాద్‌లోని చర్చిల్లో గ‌త‌రాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు కొనసాగాయి. చ‌ర్చిల‌ను విద్యుత్ దీపాల వెలుగులతో అలంక‌రించారు. సికింద్రాబాద్‌లోని సెయింట్ ఆన్స్‌ చర్చిలో వేలాది మంది క్రైస్తవులు ప్రార్థనలు చేస్తున్నారు. భక్తులతో తెలుగు రాష్ట్రాల్లోని చ‌ర్చిలు కోలాహలంగా వున్నాయి.

  • Loading...

More Telugu News