kanpur businessman: యూపీ ఎస్పీ నేత ఇంట్లో నోట్ల కట్టల లెక్క తేలింది... రూ.177 కోట్లు స్వాధీనం

Rs 177 crore seized from house of Kanpur perfume trader
  • 40 షెల్ కంపెనీల పేరుతో అక్రమ దందా
  • ఒక్కో ట్రక్ రవాణా బిల్లు రూ.50వేల లోపే
  • పెద్ద ఎత్తున జీఎస్ టీ ఎగవేత
  • సోదాలు పూర్తి అయితేనే మొత్తం లెక్క తేలుతుందున్న అధికారులు

యూపీ సుగంధ ద్రవ్యాల వ్యాపారి, సమాజ్ వాదీ పార్టీ నేత పీయూష్ జైన్ అక్రమ వ్యాపార తీరును దర్యాప్తు అధికారులు వెలుగులోకి తీసుకొచ్చారు. సూటు కేసు (షెల్) కంపెనీలను ఏర్పాటు చేసి.. వాటి పేరుతో రుణాలు తీసుకోవడమే కాకుండా.. పెద్ద ఎత్తున విదేశీ లావాదేవీలు కూడా నిర్వహించినట్టు గుర్తించారు.

ఆయన పేరుకు మాత్రమే సుగంధ ద్రవ్యాల వ్యాపారి. కానీ 40 కంపెనీలను ఏర్పాటు చేసి అడ్డగోలు వ్యాపారం చేశాడు. రవాణా ఎంత చేస్తున్నా కానీ, ఒక ట్రక్కు లోడ్ విలువను రూ.50,000 కంటే తక్కువ చూపించాడు. అది కూడా తాను ఏర్పాటు చేసిన నకిలీ కంపెనీల పేరిట బిల్లులను సృష్టించి పెద్ద ఎత్తున జీఎస్ టీని ఎగవేసినట్టు అధికారులు గుర్తించారు.

కాన్పూర్ లోని పీయూష్ జైన్ నివాసంలో జీఎస్ టీకి చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్ టీ ఇంటెలిజెన్స్ విభాగం, ఇతర అధికారులు రెండు రోజులుగా నిర్వహించిన సోదాల్లో భారీగా నోట్ల కట్టలు వెలుగు చూడడం తెలిసిందే. మొత్తం మీద లెక్కలు చూపని రూ.177 కోట్ల నగదును అధికారులు గుర్తించారు. మరింత అక్రమాస్తులు వెలుగు చూడొచ్చని అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే కన్నౌజ్ లోని అతడి ప్రాపర్టీలలో ఇంకా సోదాలు నిర్వహించాల్సి ఉందని చెప్పారు.

ఇప్పటి వరకు జైన్ తోపాటు అతని వ్యాపార భాగస్వాములకు చెందిన 11 భవనాల్లో సోదాలు నిర్వహించారు. పీయూష్ జైన్ సమాజ్ వాదీ పార్టీ నేత కావడంతో ఎన్నికల ముందు ఆ పార్టీకి గట్టి దెబ్బ తగిలినట్టుగా భావిస్తున్నారు. అధికారులు ఈ నల్లధనాన్ని బయటకు తీయకపోయి ఉంటే, సమాజ్ వాదీ పార్టీ ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిపోయి ఉండేది.

  • Loading...

More Telugu News