Sri Vishnu: 'అర్జున ఫల్గుణ' నుంచి ఇంట్రెస్టింగ్ ట్రైలర్!

Arjuna Phalguna Movie Update
  • శ్రీవిష్ణు హీరోగా 'అర్జున ఫల్గుణ'
  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ 
  • కథానాయికగా అమృత అయ్యర్ 
  • ఈ నెల 31వ తేదీన విడుదల
శ్రీవిష్ణు హీరోగా 'అర్జున ఫల్గుణ' చిత్రం రూపొందింది. నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాతో, తేజ మారని దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శ్రీవిష్ణు సరసన నాయికగా అమృత అయ్యర్ నటించిన ఈ సినిమాను ఈ నెల 31వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో హీరో .. అతని స్నేహితులు ఎన్టీఆర్ అభిమానులుగా కనిపిస్తున్నారు. వాళ్లు తమ పేర్లు కూడా ఆది .. సింహాద్రి .. రాఖీ .. యమదొంగ అని పెట్టుకుంటారు. "అరకు వెళ్లి అక్కడ నా పేరు చెప్పు .. అక్కడ నీకు ఒక మూట ఇస్తారు" అని చెప్పడాన్ని బట్టి, ఇది గంజాయి స్మగ్లింగ్ చుట్టూ తిరిగే కథగా కనిపిస్తోంది.

పల్లెటూళ్లో పాలమ్ముకుని బ్రతికే హీరో వెంట పోలీసులు పడటానికి కారణం అదేనని అనిపిస్తోంది. 'గంగిగోవు పాలు పావు లీటరు చాలు .. " .. " ఇంకా ఎన్నాళ్లు ఖాళీగా ఉంటావురా నువ్వు'' అని తండ్రి అంటే, అందుకు సమాధానంగా హీరో "డిగ్రీ దాకా చదివాను .. ఒక ఆరు నెలలు రెస్టు తీసుకుంటే తప్పా" అనడం వంటి డైలాగ్స్ బాగున్నాయి. లవ్ ట్రాక్ ను టచ్ చేస్తూ సాగే ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
Sri Vishnu
Amrutha Ayyar
Arjuna Phalguna Movie

More Telugu News