TTD: శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు.. గంటలో 4.60 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి!

TTD special tickets for January month sold in one hour
  • జనవరి నెలకు రూ. 300 టికెట్లను విడుదల చేసిన టీటీడీ
  • ఈరోజు ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల
  • గంటలో మొత్తం టికెట్లను కొనుగోలు చేసిన భక్తులు
జనవరి నెలకు సంబంధించి శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లను ఈరోజు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేసింది. ఉదయం 9 గంటలకు రూ. 300 టికెట్లను అమ్మకాలకు ఉంచింది. జనవరి నెలకు గాను మొత్తం 4.60 లక్షలను టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయగా... కేవలం 60 నిమిషాల్లో భక్తులు టికెట్లను కొనుగోలు చేశారు.  జనవరి నెలకు సంబంధించి సర్వదర్శనం టికెట్లను ఇంకా విడుదల చేయాల్సి ఉంది. జనవరికి సంబంధించి వసతి బుకింగ్స్ ను ఈ నెల 27వ తేదీ ఉదయం 9 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.
TTD
Tirumala
Rs 300
Online Bookings

More Telugu News