Raghu Rama Krishna Raju: 'ఏంటో మరి...' అంటూ సినిమా టికెట్ల అంశంలో రఘురామ సెటైర్

Raghurama Krishnaraju satires in cinema tickets issue
  • ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపు
  • టాలీవుడ్ లో అసంతృప్తి
  • క్రమంగా హెచ్చుతున్న నిరసన స్వరాలు
  • ట్విట్టర్ లో స్పందించిన రఘురామ
ఏపీలో సినిమా టికెట్ల ధరలను భారీగా తగ్గించడంతో టాలీవుడ్ లో అసంతృప్తి జ్వాలలు చెలరేగుతుండడం తెలిసిందే. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్కొక్కరు గళం విప్పుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు.  ఏంటో మరి... నాణ్యత ప్రమాణాల కోసం మీ పత్రిక రేట్లు పెంచుకోవచ్చు, మీ సిమెంట్ రేట్లు పెంచుకోవచ్చు గానీ సినిమా టికెట్ రేట్లు తగ్గిస్తారా? అంటూ వ్యాఖ్యానించారు. రఘురామ తాజా వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది.
Raghu Rama Krishna Raju
Cinema Tickets
Price
Andhra Pradesh

More Telugu News