delhi: దేశ రాజధానిలో దొంగల ముఠా పాశవిక చర్య.. యువకుడి దారుణ హత్య!

man killed for resisting robbery bid in Delhi Sangam Vihar
  • అర్ధరాత్రి నడివీధుల్లో దొంగల ముఠా
  • ఎదురొచ్చిన ఇద్దరు యువకులపై దాడి
  • రాళ్లతో కొట్టి మురుగు కాల్వలోకి విసిరేత
  • ఒకరి మృతి.. మరో యువకుడికి తీవ్ర గాయాలు
దేశ రాజధాని ఢిల్లీలో దొంగలు యథేచ్ఛగా సంచరించడమే కాకుండా.. అడ్డొచ్చిన ఇద్దరు యువకులను చావబాదడం సంచలనం కలిగించింది. దక్షిణ ఢిల్లీ సంగమ్ విహార్ ప్రాంతంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఏడుగురు యువకులతో కూడిన ముఠా.. ముందు ఇద్దరు, వెనుక ఐదుగురు నడుస్తూ పరిసరాలను గమనిస్తూ వెళుతున్నారు. అటువైపు నుంచి ఇద్దరు యువకులు వారిని గమనిస్తూ దాటి వెళుతుండగా.. దొంగల ముఠా వెనక్కి వచ్చి వారిపై దాడికి దిగింది.

తమ గురించి సమాచారం ఇస్తారని భావించారో, ఏమో కానీ కాళ్లతో, చేతులతో, వీధిలో కనిపించిన బండరాళ్లను తీసుకుని బలంగా కొట్టారు. ఆ తర్వాత ఈడ్చుకెళ్లి పక్కనే వున్న మురుగు కాల్వలో పడేశారు. ఈ దెబ్బలకు ఒక యువకుడు ప్రాణం కోల్పోగా.. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ నెల 20 రాత్రి 2 గంటల తర్వాత ఈ దాడి జరిగినట్టు సీసీటీవీ రికార్డు ఆధారంగా తెలుస్తోంది.

సీసీటీవీ ఫుజేటీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడి చేసిన వారిలో ఒకరిని అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. మిగిలిన వారి కోసం అన్వేషిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో లీక్ కాగా, అందులోని దృశ్యాలు పాశవికంగా ఉన్నాయి. ఢిల్లీలో ఇలాంటి దారుణాలు తరచూ సాధారణంగా మారాయి.
delhi
robbers
attack
youngers

More Telugu News