Congress: మతమార్పిడి నిరోధక బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం.. కాంగ్రెస్ సభ్యుల నిరసన

Anti conversion bill passed by Karnataka assembly
  • బిల్లును ఆరెస్సెస్ ఎజెండాగా అభివర్ణించిన సిద్ధరామయ్య
  • దేశ సంస్కృతిని కాపాడే బిల్లు అని సమాధానమిచ్చిన మంత్రి
  • బలవంతపు మతమార్పిడులకు పాల్పడితే గరిష్ఠంగా ఐదేళ్ల జైలు శిక్ష

కర్ణాటక అసెంబ్లీ నిన్న కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసనల మధ్య మత మార్పిడి నిరోధక బిల్లును ఆమోదించింది. మూజువాణి ఓటుతో దీనిని ఆమోదించారు. ఈ బిల్లును కాంగ్రెస్‌తోపాటు క్రైస్తవ సంఘాలు కూడా తీవ్రంగా వ్యతిరేకించాయి.

బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. సభలో బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ఈ బిల్లు ఆరెస్సెస్ ఎజెండా అని ధ్వజమెత్తారు. అయితే, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప మాట్లాడుతూ.. ఇది దేశ సంస్కృతిని కాపాడే బిల్లు అని దీటుగా సమాధానమిచ్చారు.

ఈ బిల్లు ప్రకారం.. బలవంతంగా కానీ, ప్రలోభాలకు గురిచేయడం ద్వారా కానీ, మోసపూరిత విధానాల ద్వారా కానీ మతమార్పిడికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. గరిష్ఠంగా ఐదేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 50 వేల వరకు జరిమానా విధిస్తారు. నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తారు.

  • Loading...

More Telugu News