Hero Motocorp: పెరగనున్న హీరో మోటోకార్ప్ ద్విచక్ర వాహనాల ధరలు

Hero Motocorp hikes prices
  • లోహాలు, ప్లాస్టిక్ ధరల పెంపు
  • తాము కూడా ధరలు పెంచాల్సి వస్తోందన్న హీరో
  • గత సెప్టెంబరులో ఓసారి ధరలు పెంచిన సంస్థ
  • తాజాగా పెంచిన ధరలు జనవరి 4 నుంచి అమలు

లోహాలు, ప్లాస్టిక్, ఇతర ముడిపదార్థాలు, వస్తువుల ధరల పెరుగుదల నేపథ్యంలో ద్విచక్ర వాహనాల ధరలు పెంచుతున్నట్టు దేశీయ వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ వెల్లడించింది. 2022 జనవరి 4 నుంచి తమ వాహనాల ధరల పెంపు అమల్లోకి వస్తుందని తెలిపింది. మోడల్, మార్కెట్ ను బట్టి గరిష్టంగా రూ.2 వేల వరకు పెంపు ఉంటుందని హీరో వర్గాలు వివరించాయి.

ఈ ఏడాది సెప్టెంబరులోనూ హీరో తన మోటార్ సైకిళ్లు, స్కూటర్ల ధరలు పెంచింది. స్థిరంగా కొనసాగుతున్న కమోడిటీ ధరల తాకిడిని పాక్షికంగా తట్టుకునేందుకు ధరల పెంపు అనివార్యంగా మారిందని తాజాగా హీరో కంపెనీ వెల్లడించింది. కాగా, ధరల పెంపు నిర్ణయంతో స్టాక్ మార్కెట్లో హీరో వాటా గణనీయంగా పెరిగింది.

  • Loading...

More Telugu News