Gopichand: గోపీచంద్ 30వ సినిమాకి ముహూర్తం ఖరారు!

  • రిలీజ్ కి రెడీగా 'పక్కా కమర్షియల్'
  • తదుపరి సినిమా శ్రీవాస్ తో
  • ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండు హిట్లు
  • నిర్మాతలుగా విశ్వప్రసాద్ .. వివేక్ కూచిభొట్ల    
Gopichand in Sriwass Movie

హీరోగా పరిచయమైన దగ్గర నుంచి గోపీచంద్ తన మార్క్ చూపిస్తూ వస్తున్నాడు. మొదట్లో మాస్ యాక్షన్ మూవీస్ ఎక్కువగా చేస్తూ వచ్చిన ఆయన, ఆ తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించే కథలను చేస్తూ వెళుతున్నాడు. అయితే కొంతకాలంగా ఆయనకి సరైన హిట్ పడలేదు.

ఈ నేపథ్యంలో ఆయన మారుతి దర్శకత్వంలో 'పక్కా కమర్షియల్' సినిమాను చేశాడు. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా నుంచి త్వరలోనే రిలీజ్ డేట్ కి సంబంధించిన ఎనౌన్స్ మెంట్ రానుంది. అలా ఆ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, తన 30వ సినిమాను శ్రీవాస్ దర్శకత్వంలో పట్టాలెక్కిస్తున్నాడు.

ఇంతకుముందు ఈ ఇద్దరి కాంబినేషన్లో లక్ష్యం .. లౌక్యం అనే రెండు సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్టే. ఇక రేపు మూడవ సినిమా ప్రారంభోత్సవాన్ని జరుపుకోనుంది. రేపు ఉదయం 11:13 నిమిషాలకు పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. విశ్వప్రసాద్ - వివేక్ కూచిభొట్ల ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు..

More Telugu News