Omicron: తమిళనాడులో ఒక్కరోజే 33 ఒమిక్రాన్ కేసుల వెల్లడి

Thirty three new Omicron cases identified in Tamilnadu
  • దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల సంఖ్య
  • తమిళనాడులోనూ 34కి పెరిగిన కొత్త వేరియంట్ కేసులు
  • ఇద్దరు తప్ప మిగిలినవారందరూ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారే  
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తమిళనాడులో తాజాగా 33 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 30 మంది విదేశాల నుంచి రాగా, ఒకరు కేరళ నుంచి వచ్చారు. మరో ఇద్దరు తమిళనాడులోనే ఒమిక్రాన్ బారినపడినట్టు తెలుస్తోంది. కాగా, ఈ 33 మందిలో ఇద్దరు తప్ప మిగిలినవారందరూ కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారు. అయినప్పటికీ కొత్త వేరియంట్ సోకడం ఆందోళన కలిగిస్తోంది.

ఊరట కలిగించే విషయం ఏమిటంటే, కొత్తగా వెల్లడైన కేసుల్లో పెద్దగా లక్షణాలతో బాధపడుతున్నవారు లేరు. ఒకరిద్దరిలో మాత్రం స్వల్పంగా గొంతునొప్పి, వికారం వంటి లక్షణాలు కనిపించాయని తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి మా సుబ్రమణియన్ వెల్లడించారు. కాగా, తాజా కేసులతో కలిపి తమిళనాడులో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 34కి పెరిగింది.
Omicron
New Cases
Tamil Nadu
India

More Telugu News